
‘హరిహర వీరమల్లు’ను అడ్డుకుంటాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు వ్యతిరేకంగా పలు సంఘాల ఆధ్వర్యంలో గురువారం పీయూ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజావీరుడు పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరిస్తూ సినిమా తీయడం తెలంగాణ ఉద్యమ యోధులను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెచ్‌సీయూ నాయకులు శివముదిరాజ్, బెక్కం జనార్ధన్, బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్, తాయప్ప, వెంకటేష్, గాలెన్న, రామ్మోహన్, రవీందర్ పాల్గొన్నారు.