
శిశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
మహబూబ్‌నగర్ రూరల్: శిశు గృహలోని శిశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ సమీపంలో బాల సదనం నిర్మాణంలో ఉన్న కొత్త భవనం, శిశుగృహ, డైట్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న కొత్త భవనం, ఎగ్జిబిషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల సదనం భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శిశుగృహాన్ని సందర్శించి.. మెనూ ప్రకారం ఆహారం లేకపోవడం గమనించి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశు గృహలోని పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహి ంచాలని, శిశువులు, బాలల సంరక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించా రు. పిల్లలు ఇంటి వాతావరణంలో పెరిగేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారా అని ఆరాతీశారు. చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పార్కులో తిప్పాలని చెప్పారు. అక్కడ పిల్లలకు ఉపయోగపడే ఆటలు ఆడించాలని, ప్రతిఒక్క చిన్నారి ఆరోగ్య వివరాలు సేకరించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డైట్ కాలేజీలో నూతన భవనాన్ని పరిశీలించి పనుల ప్రగతి తెలుసుకున్నారు. డైట్ కళాశాల విద్యార్థినులు ఏర్పాటు చేసిన ఒకరోజు ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీడబ్ల్యూఓ జరీనాబేగం ఉన్నారు.