పుస్తకాలు సమాజానికి దిక్సూచి | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలు సమాజానికి దిక్సూచి

Jul 10 2025 6:20 AM | Updated on Jul 10 2025 6:20 AM

పుస్తకాలు సమాజానికి దిక్సూచి

పుస్తకాలు సమాజానికి దిక్సూచి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పుస్తకాలు సమాజానికి దిక్సూచిగా ఉండాలని పీయూ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రచించిన ‘ట్రైన్‌ ట్రాన్స్‌ఫార్మ్‌ ట్రాయాంఫ్‌ ఆండ్‌ స్పొర్ట్స్‌ న్యూట్రీషియన్‌, వెయిట్‌ మేనేజ్‌మెంట్‌’ అనే పుస్తకాన్ని ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచం వేగంగా మార్పుచెందుతోందని, మార్పులను వివరంగా పాఠకులకు అందించేందుకు రచయితలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని, వారు పరిశోధన రంగాల్లో మార్గదర్శకులుగా నిలవాలన్నారు. పుస్తకాలు ఒక్క యూనివర్సిటీకే కాకుండా యావత్‌ సమాజాన్నే ప్రభావితం చేసే విధంగా ఉంటాయన్నారు. ఈ పుస్తకం బీపెడ్‌, ఎంపెడ్‌ చేసే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రవీణ, ప్రిన్సిపాల్‌ కరుణాకర్‌రెడ్డి, రవికాంత్‌, పీడీ సత్యభాస్కర్‌, భూమయ్య, అర్జున్‌కుమార్‌, శ్రీధర్‌రెడ్డి, /్ఞానేశ్వర్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement