
‘ఫోన్ ట్యాపింగ్‌పై సిట్‌కు ఫిర్యాదు చేస్తా’
స్టేషన్ మహబూబ్‌నగర్: తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని, దీనిపై సిట్‌కు ఫిర్యాదు చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన దివంగత మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డితో ఫోన్‌లో సంభాషిస్తుంటే 2018లో తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. అప్పట్లో అందరి సమక్షంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తనను అవమానపరిచి మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు ఉండడం సహజమని, గత ప్రభుత్వం అవి మరిచి ఇతరులను ఇబ్బందులు పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని ప్రజలు తిరస్కరించాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలతో సిట్‌కకు ఫిర్యాదు చేస్తానని నర్సింహారెడ్డి తెలిపారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, సీజే బెనహర్ పాల్గొన్నారు.