
28 నుంచి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వీసీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం పీయూలో అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాలోని నార్త్‌డామ్ యూనివర్సిటీ వారి గ్లోబల్ సెంటర్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది ఓల్ చైల్డ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించే అవకాశం ఉంటుందని, నార్త్‌డామ్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, రీసోర్స్ పర్సన్ శాలిని, రూబీనా ఫిలిప్స్, హెచ్‌ఓడీ ఆంజనేయులు, జంగం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.