
జనరల్ ఆస్పత్రులకు కొత్త అధిపతులు
పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, జనరల్ ఆస్పత్రులకు కొత్త అధిపతులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణపేట జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా కాకతీయ మెడికల్ కళాశాలలో రేడియో థెరఫి విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సి.సంజీవ్‌కుమార్‌ను నియమించారు. అదే విధంగా గాంధీ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ కె.నాగార్జున గద్వాల జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా, మహేశ్వరం మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డా.మహబూబ్‌ఖాన్‌ను గద్వాల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. వికారాబాద్ మెడికల్ కళాశాల జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ పి.మల్లిఖార్జున్ వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, నిజామాబాద్ మెడికల్ కళాశాల పిడియాట్రిక్ ప్రొఫెసర్ టి.ఉషారాణి నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. సంగారెడ్డి కళాశాల ఈఎన్‌టీ విభాగం ప్రొఫెసర్ శోభన్‌బాబును వనపర్తి జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా నియమించారు.
మెడికల్ కళాశాలలకు సైతం నూతన ప్రిన్సిపాళ్లు
ఉమ్మడి జిల్లాలో సమూల మార్పులు

జనరల్ ఆస్పత్రులకు కొత్త అధిపతులు