
జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలకు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరితోపాటు ఆయా విభాగాల్లో పతకాలు సాధించిన విద్యార్థులను సోమవారం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో సీనియర్ విభాగంలో జయదీప్‌సింగ్, రోహిత్‌కుమార్‌రెడ్డి, రితిక్‌లు పాయింట్ ఫైవ్‌లో బంగారు పతకాలు సాధించి చత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయపూర్‌లో ఈనెల 16 నుంచి 21 వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు, జూనియర్ విభాగంలో శివప్రసాద్, రేవంత్‌లు ఆగస్టులో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సలహాదారులు విజయ్‌కుమార్, సీనియర్ విద్యార్థులు నిఖిల్, యామిని, కావ్య, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.