చిరుత జాడలు కనిపెట్టిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

చిరుత జాడలు కనిపెట్టిన అధికారులు

Jul 8 2025 7:02 AM | Updated on Jul 8 2025 7:02 AM

చిరుత

చిరుత జాడలు కనిపెట్టిన అధికారులు

మహమ్మదాబాద్‌: మండలంలోని గాధిర్యాల్‌ అటవీశివారులో ఓగుట్టపై వారం రోజులుగా చిరుత సంచరిస్తుంది. నిత్యం ఉదయం, సాయంత్ర వేళల్లో ఓ గుండుపైకి ఎక్కి పడుకొని ఉన్న సమయంలో రైతులు చూస్తూనే ఉన్నారు. చుట్టూ ఉన్న రైతులు తమ పశువులకు రక్షణ కరువైందని, భయాందోళన చెందుతూ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆదివారం డ్రోన్‌ కెమెరాతో చిరుత సంచారాన్ని కనిపెట్టారు. గుండుపై నుంచి ఓ గుహలోకి వెళ్లడాన్ని డ్రోన్‌లో చిత్రించారు. సోమవారం ఉదయం అటవీశాఖ బృందం గ్రామస్తులు గుట్టనంతా గాలించగా.. ఓగొర్రెను, కుక్కలను పట్టుకుని తిన్నట్లు పక్కనే ఉన్న ఓ కుంటలోకి వెళ్లి నీళ్లు తాగినట్లు జాడలు గుర్తించారు. ప్రస్తుతం చిరుత ఆ ప్రాంతంలో లేదని, మరుసటిరోజు కూడా ఆచూకీ వెతికి బోను ఏర్పాటు చేస్తామని రైతులకు తెలిపారు. పశువులను భద్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు.

చిరుత జాడలు కనిపెట్టిన అధికారులు 1
1/1

చిరుత జాడలు కనిపెట్టిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement