
సమయం వృథా చేయొద్దు: యెన్నం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సమయం వృథా చేయొద్దని యువతకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ‘మహబూబ్ నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ కళాభవన్‌లో 75 రోజుల పాటు ఉచిత కోచింగ్ పొందిన విద్యార్థులకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే టెట్, డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇచ్చామని వారందరూ ఉత్తమ ఫలితాలు సాధిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. చదువు మనను జీవితంలో నిలబెట్టడమే గాక ఉన్నత స్థానానికి చేరుస్తుందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేంతవరకు వేచిచూడకుండా ముందుగానే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనో హర్, కాంగ్రెస్ నాయకులు సీజే బెన్‌హర్, నాని యాదవ్, అంజద్ తదితరులు పాల్గొన్నారు.