నష్టపరిహారం కోసం రోడ్డు పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

నష్టపరిహారం కోసం రోడ్డు పనుల అడ్డగింత

May 28 2025 12:27 AM | Updated on May 28 2025 12:27 AM

నష్టప

నష్టపరిహారం కోసం రోడ్డు పనుల అడ్డగింత

ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేశా

నా భార్య పద్మావతి పేరున ఉన్న భూమి భారత్‌మాల రోడ్డు నిర్మాణంలో పోయింది. మొదటి విడత పరిహారం చెల్లించారు. రెండో విడత పరిహారానికి సంబంధింయి నోటీస్‌ అందలేదని ఫిబ్రవరిలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా. మూడు పర్యాయాలు కలెక్టర్‌ కార్యాలయానికి తిరిగినా అధికారులు స్పందించలేదు. నష్టపరిహారం డబ్బులు ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు.

– వెంకట్రాములు, గట్టు

తిరుగుతూనే ఉన్నాం

భారత్‌మాల రోడ్డు నిర్మాణంలో భూములను కోల్పోయినందుకు అందించే నష్టపరిహారం కోసం కార్యాలయాల చుట్టూ అనేక పర్యాయాలు తిరిగితే సగం మాత్రమే పరిహారం చెల్లించారు. ఆర్భిట్రేషన్‌ తర్వాత చెల్లించాల్సిన పరిహారం చెల్లించలేదు. గట్టు తహసీల్దార్‌ కార్యాలయంలో రెండవ విడత నోటిసు గురించి అడితే మాకేం తెలియదంటున్నారు.కలెక్టరేట్‌లో అడిగితే వస్తుందని చెబుతున్నారు. రెండు నెలలు గడిచాయి. ఇప్పటికి పరిహారం అందించలేదు.రెండవ విడత పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి. – కావలి తిమ్మప్ప, గంగిమాన్‌దొడ్డి

గట్టు: మండలంలోని గంగిమాన్‌దొడ్డి వద్ద ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణ పనులను గట్టు, గంగిమాన్‌దొడ్డి గ్రామాలకు చెందిన రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మొదటి విడత పరిహారం చెల్లించిన అధికారులు.. ఆర్బిట్రేషన్‌ తర్వాత చెల్లించాల్సిన డబ్బులను ఇప్పటి దాకా చెల్లించలేదని రైతులు వాపోయారు. ఆర్బిట్రేషన్‌(భూములను నష్టపోయిన రైతులతో కలెక్టర్‌ సమావేశమై వారి డిమాండ్‌ మేరకు నష్టపరిహారం పెంచి, అందించేది) తర్వాత తమకు నోటీసులను ఇవ్వలేదని, అదనంగా తమకు నష్టపరిహారం ఇవ్వాలని ఇది వరకే కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. అయినా ఇప్పటికీ రెండో విడత పరిహారం మాత్రం తమకు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. తాము కలెక్టర్‌, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే తమకేమి పట్టనట్లు అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయంగా అందించాల్సిన పరిహారం అందించేదాకా రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలుపుతామని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా రోడ్డు నిర్మాణం కోసం మెటీరియల్‌ తీసుకెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు రైతుల ఆందోళనకు సంఘీబావం తెలియజేశారు. విషయం తెలుసుకున్న సైట్‌ ఇన్‌చార్జ్‌ అఫ్జల్‌ రైతులు ఘటనా స్థలానికి చేరుకొని.. రైతులకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని అందించే విధంగా తాను కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. రెండో విడత పరిహారం రాని రైతులతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలుస్తామని తెలిపారు.

అందని రెండో విడత పరిహారం

అధికారులకు విన్నవించినాపట్టించుకోలే..

భారత్‌మాల రోడ్డు సైట్‌ ఇన్‌చార్జ్‌ జోక్యంతో శాంతించిన రైతులు

నష్టపరిహారం కోసం రోడ్డు పనుల అడ్డగింత 1
1/2

నష్టపరిహారం కోసం రోడ్డు పనుల అడ్డగింత

నష్టపరిహారం కోసం రోడ్డు పనుల అడ్డగింత 2
2/2

నష్టపరిహారం కోసం రోడ్డు పనుల అడ్డగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement