తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు

May 28 2025 12:27 AM | Updated on May 28 2025 12:27 AM

తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు

తీర్థయాత్రలకు ప్రత్యేక రైళ్లు

వనపర్తి: తీర్ధయాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూన్‌ 14వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు హైదరాబాద్‌ కేంద్రంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్‌టీసీ టూరిజం జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ డీఎస్‌జీపీ కిషోర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో ప్యాకేజీలకు సంబంధించిన వివరాలు..

ప్యాకేజీ 1: (గంగా రామాయణ

పుణ్య క్షేత్రయాత్ర– ఇోఆఎ44):

ఇందులో (కాశీ) వారణాసి/అయోధ్య/నైమిశారణ్య/ప్రయాగరాజ్‌ /శృంగవర్పూర్‌ ప్రాంతాలు దర్శించవచ్చు. ఈ యాత్ర జూన్‌ 14 వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్టు ధర రూ.16,200, థర్డ్‌ ఏసీ ధర రూ.26,500, సెకండ్‌ ఏసీ ధర రూ.35,000 ఉంటుంది. ఈ తీర్థయాత్రలో ట్రైన్‌ సికి ంద్రాబాద్‌, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్‌, మహబూబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మఽ దిర, విజయవాడ, ఏలూరు రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి ,విజయనగరం, పలాస, బరంపూర్‌, భువనేశ్వర్‌ మీదుగా వెళ్తుంది. .

ప్యాకేజీ 2: (ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాల యాత్ర – ఇోఆఎ43): ఉజ్జయిని (మహాకాళేశ్వర్‌–ఓంకారేశ్వర్‌– త్రయంబకేశ్వర్‌–భీమశంకర్‌–ఘృష్ణేశ్వర్‌) ఈ యాత్రలో మహాకాళేశ్వర్‌/ఓంకారేశ్వర్‌/త్రయంబకేశ్వర్‌ / భీంశంకర్‌/ఘృష్ణేశ్వర్‌/ఎల్లోరా/మోవ్‌/నాగ్పూర్‌ ప్రాంతాలు సందర్శించవచ్చు. ఇది జూలై 05వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొక్కరికి సాధారణ టికెట్‌ ధర రూ.14700గా ఉండగా , థర్డ్‌ ఏసీ ధర రూ.22,900, సెకండ్‌ ఏసీ ధర రూ.29, 900 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ధర్మాబాద్‌, నాందేడ్‌, ముధ్ఖడ్‌ మరియు పూర్ణ మీదుగా సాగుతుంది.

సౌకర్యాలు: రైలు, బస్సు, హోటల్‌, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం), వాటర్‌ బాటిల్‌ మరియు టూర్‌ ఎస్కాట్‌ సేవలతో సందర్శన స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్‌ అలాగే రైల్వే స్టేషన్‌ నుంచి దేవాలయాల వరకు ప్రయాణం పూర్తిగా ఉచితం. ప్రతి రైలులో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సాకర్యాలు సమకూరుస్తారు. కోచ్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్‌ అలాగే రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందన్నారు. టికెట్‌ బుకింగ్‌ వివరాలకు 97013 60701, 92810 30712, 92814 95845, 92810 30749, 92810 30750 నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు www.irctc tourirm.com వైబ్సెట్‌ని సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement