నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ జట్టు ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ జట్టు ఎంపికలు

May 26 2025 12:24 AM | Updated on May 26 2025 12:24 AM

నేడు జిల్లాస్థాయి  అథ్లెటిక్స్‌ జట్టు ఎంపికలు

నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ జట్టు ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో వచ్చే నెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అండర్‌– 8, 10, 12 ఏళ్లలోపు బాల, బాలికల అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి శరత్‌చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, తహసీల్దార్‌ ద్వారా కుల, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

నేడు లైసెన్స్‌డ్‌

సర్వేయర్లకు శిక్షణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): భూ భారతి చట్టం అమలులో భాగంగా నియమించనున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు సోమవారం జిల్లా పరిషత్‌ హాల్‌లో శిక్షణ నిర్వహించనున్నట్లు సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కిషన్‌రావు ఆదివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమాన్ని కలెక్టర్‌ విజయేందిర ప్రారంభిస్తారన్నారు. సర్వేయర్లు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.

ఇంట్రా టూడే లీగ్‌లో రాణించాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్‌ టూడే లీగ్‌లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్‌ మైదానంలో అండర్‌–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్‌ టూడే లీగ్‌లో భాగంగా ఆదివారం మహబూబ్‌నగర్‌– నాగర్‌కర్నూల్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌ క్రీడా జట్లను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఇంట్రా డిస్ట్రిక్ల్‌ లీగ్‌ క్రీడాకారులకు మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రా డిస్ట్రిక్ట్‌ లీగ్‌లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జట్లకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్రా డిస్ట్రిక్ట్‌ లీగ్‌లో రాణించే క్రీడాకారులకు త్వరలో జరిగే హెచ్‌సీఏ టోర్నమెంట్‌లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఇంట్రా డిస్ట్రిక్ట్‌ లీగ్‌లు ప్రారంభించిన హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌లు అబ్దుల్లా, ఎండీ మన్నాన్‌, సీనియర్‌ క్రీడాకారుడు ఆబెద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

లీగ్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

సమర్థ స్కూల్‌ మైదానంలో మహబూబ్‌నగర్‌– నాగర్‌కర్నూల్‌ జట్ల మధ్య టూడే లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన నాగర్‌కర్నూల్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 37.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్‌ అయిది. జట్టులో కేతేశ్వర్‌ 65 పరుగులు చేశాడు. మహబూబ్‌నగర్‌ బౌలర్లు కొండ శ్రీకాంత్‌ 9.5 ఓవర్లలో 33 పరుగులకు 4 వికెట్లు, మహ్మద్‌ షాదాబ్‌ అహ్మద్‌ 12 ఓవర్లలో 33 పరుగులకు 4 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్‌ జట్టుకు పలుమార్లు వర్షం అడ్డంకిగా మారింది. 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేయగా వర్షం వల్ల మ్యాచ్‌ను నిలిపివేశారు. ఓపెనర్‌ ఎ.శ్రీకాంత్‌ 72 బంతుల్లో 11 ఫోర్లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సోమవారం రెండో రోజు మ్యాచ్‌ కొనసాగనుంది.

ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం

మరికల్‌: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈక్రమంలోనే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని ఆమె మరికల్‌లో వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్‌లో దాక్కున్న ఉగ్రవాదుల స్థావరాలపై ప్రతీకార దాడి చేసి విజయం సాధించమన్నారు. సైనికుల విజయానికి మద్దతుగా తీరంగా యాత్ర నిర్వహించామని, ఇందుకు దేశ ప్రజల నుంచి కూడా సంపూర్ణ మద్దతు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. భవిష్యత్‌లో భారతదేశంపై ఎక్కడ దాడి జరిగిన ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి వేయడం కోసం చేపట్టి ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, నాగురావు, రతంగపాండురెడ్డి, నర్సన్‌గౌడ్‌, వేణు, తిరుపతిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రాజేష్‌, శ్రీరామ్‌, రమేష్‌, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement