
భారీగా పట్టివేత..
ప్రభుత్వం బీజీ–3 పత్తి విత్తనాల కట్టడికి ఎంతగా చర్యలు చేపడుతున్నా బహిరంగ మార్కెట్‌లోకి మాత్రం విచ్చలవిడిగా నిషేధిత విత్తనాలు వస్తున్నాయి. గతేడాది జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్‌లో ఇద్దరు వ్యక్తుల దగ్గర 2.21 క్వింటాళ్ల బీజీ–3 పత్తి విత్తనాలు పట్టుబడగా తాజాగా ఇదే గ్రామంలో మళ్లీ దొరికాయి. అలాగే సమీపంలోని ఈర్లపల్లి తండాలోనూ ఇద్దరు వ్యక్తుల వద్ద బీజీ–3 పత్తి విత్తనాలు పట్టుబడటం గమనార్హం. నాలుగేళ్ల క్రితం ఏకంగా జడ్చర్లలోనే ఓ పత్తి విత్తన వ్యాపారి నకిలీ విత్తనాలను తయారు చేసి విక్రయిస్తుండగా అప్పట్లో విజిలెన్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.