
ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానల్ ఘన విజయ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానల్ ఘన విజయం సాధించింది. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌కు 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జర్నలిస్టు యూనియన్లను కాదని ఇండిపెండెంట్ ప్యానల్‌కు ఏకపక్షంగా జర్నలిస్టులు గెలుపును కట్టబెట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో జర్నలిస్టులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 250 ఓట్లకు గాను 243 ఓట్లు పోలయ్యాయి. మహబూబ్‌నగర్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా నరేంద్రచారి (హెచ్‌ఎం టీవీ), ప్రధాన కార్యదర్శిగా నరేందర్‌గౌడ్ (ఆంధ్రజ్యోతి), కోశాధికారిగా పి.యాదయ్య (సాక్షి), ఉపాధ్యక్షులుగా చింతకాయల వెంకటేష్ (ఐన్యూస్), అక్కల ధరణికాంత్ (వెలుగు), అంజిలయ్య (టీవీ9), సహాయ కార్యదర్శులుగా మణిప్రసాద్ (అబీ న్యూస్), పుట్టపాగ సతీష్‌కుమార్ (నమస్తే తెలంగాణ), కృష్ణ (సూర్య), ఈసీ మెంబర్లుగా ఇట్కలి మోహన్‌దాస్ (సాక్షి), రాంకొండ (ఆర్ టీవీ), జి.రవికుమార్ (ఆంధ్రజ్యోతి), కె.వెంకట్రాములు (నమస్తే తెలంగాణ), అబ్బుల్ అహద్ సిద్ధిఖీ (సహారా), షాబుద్దీన్ ముల్ల (ఎత్తెమాద్) గెలుపొందారు. అనంతరం గెలుపొందిన ప్యానల్ మెట్టుగడ్డ నుంచి న్యూటౌన్, బస్టాండ్, అశోక్ టాకీస్ చౌరస్తా, గడియారం చౌరస్తా, పాతబస్టాండ్, తెలంగాణ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నరేందర్‌చారి మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్ విజయం జర్నలిస్టులకు అంకితం ఇస్తున్నామని, తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుకు ఏ ఆపద వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.

ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానల్ ఘన విజయ

ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానల్ ఘన విజయ