
నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు తుది దశకు చేరాయి. రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో ఉమ్మడి జిల్లాకే తలమానికంగా స్టేడియం నిర్మాణం జరుగుతోంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రీడాకారుల కల త్వరలో నెరవేరబోతుంది. అన్ని హంగులు, వసతులతో నిర్మిస్తున్న స్టేడియం త్వరలో ప్రారంభం కానుంది.
తుది దశలో పనులు..
రూ.7.79 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం జరుగుతోంది. స్టేడియం నిర్మాణంపై మంత్రి ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పనుల వేగవంతం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రౌండ్, రెండో ఫ్లోర్‌లో పెవీలియన్, ఇతర గదుల పనులు పూర్తి చేశారు. టేబుల్ టెన్నీస్ హాల్, బాక్సింగ్ హాల్‌తో పాటు స్టోర్ రూం, క్రీడాకారుల గదులను ఏర్పాటు చేశారు. పోటీలను తిలకించడానికి రెండు వైపుల గ్యాలరీలు ఏర్పాటు చేసి సీట్లు అమర్చారు. ఉడెన్ బాస్కెట్‌బాల్ కోర్టు, మూడు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేశారు. స్టేడియం బయటి గోడలపై అంతర్జాతీయ క్రీడాకారుల చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు.
మెరుగైన వసతులు..
మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే వెయిట్ లిఫ్టింగ్, జూడో, బాక్సింగ్, కబడ్డీతో పాటు ఇతర ఇండోర్ క్రీడలు ఆడే అవకాశం ఉంది. అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నీస్, టెన్నికాయిట్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయస్థాయి ఇండోర్ క్రీడాపోటీలకు మహబూబ్‌నగర్‌లోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం వేదికగా మారే అవకాశం ఉంది.
చివరి దశలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు
రూ.7.79 కోట్లతో నిర్మాణం
ఉడెన్ కోర్టుల ఏర్పాటు
త్వరలో ప్రారంభం..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటవుతుంది. త్వరలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. స్టేడియంలో క్రీడాకారులకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నాం. నిష్ణాతులైన కోచ్‌లు వస్తారు. అంతర్జాతీయస్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. – ఎస్.శ్రీనివాస్, డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్

ఉడ్‌తో ఏర్పాటు చేసిన కోర్టు
