కోనేరులో మునిగి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కోనేరులో మునిగి వ్యక్తి మృతి

Sep 22 2023 1:14 AM | Updated on Sep 22 2023 1:14 AM

జడ్చర్ల: జడ్చర్ల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వెంకటేశ్వర కాలనీకి చెందిన నర్సింహులు, (42) సమీప గణేష్‌ మండపం దగ్గర భక్తులకు ఫులిహోర ప్రసాదం పంపిణీ చేసి చేతులు శుభ్రం చేసుకునేందుకు పక్కనే ఉన్న కోనేరులోకి దిగాడు. చేతులు కడుక్కుంటుండగా మెట్లపై పాకర ఉండడంతో కాలు జారీ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఆ సమయంలో ఎవరు గమనించక పోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. అతనికి భార్య గంగ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదని సీఐ రమేశ్‌బాబు తెలిపారు.

మహిళా

అనుమానాస్పద మృతి

రాజాపూర్‌: మండలంలోని చెన్నవెల్లిలో ఓ మహిళ అనుమాదస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి వివరాల ప్రకారం జడ్చర్ల పాతబజారుకు చెందిన పిట్టల జయమ్మ(36)తో 18 సంవత్సరాల కిందట చెన్నవెల్లి గ్రామానికి చెందిన లవయ్యతో వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. భార్య చనిపోయిందని ఇంటి ముందు భర్త కన్నీటిపర్యంతం అయ్యాడు. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లిచూడగా జయమ్మ విగతజీవిగా కనిపించింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి కొడుగంటి పెంటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

చెరువులో బోరు మోటారు తీసేందుకు వెళ్లి..

ఖిల్లాఘనపురం: ప్రమాదవశాత్తుతో చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎ్‌స్‌ఐ శ్రీహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కమాలొద్దీన్‌పూర్‌కి చెందిన కమ్ము నర్సింహులు(38) గ్రామంలోని నాగసముద్రం చెరవు లో కృష్ణయ్యకు చెందిన కాలిపోయిన బోరు మో టారు బయటకు తీసేందుకు వెళ్లాడు. కాలిపోయిన మోటార్‌ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. మృతుని భార్య చిట్టెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మహాబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

వ్యక్తి బలవన్మరణం

హన్వాడ: భార్య పుట్టింటికి వెళ్లిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మండలంలోని ఇబ్రహీంబాద్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవినాయక్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోవి మంగమ్మ భర్త బాలయ్య (38)తో గొడవపడి తల్లిగారి ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన బాలయ్య ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

బాలిక ఆత్మహత్య

మిడ్జిల్‌: మండలంలోని రాణిపేటలో ఓ బాలిక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు. ఆయన కథనం మేరకు.. బాలికకు చిన్నాన్న వరుస అయ్యే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వేధించడంతో బుధవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగింది. గురువారం కుటుంబ సభ్యులు చూసే సరికి మృతిచెంది కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి

మృతిపై కేసు నమోదు

అడ్డాకుల: మూసాపేటలో నివసించే రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి రేమద్దుల గంగపురి(55) మృతిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఇంట్లో చనిపోయి ఉన్న గంగపూరి మృతదేహాన్ని బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. విదేశాల్లో ఉన్న కుమారుడు రావడంతో గంగపురి భార్య లత గురువారం మూసాపేట ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసిన పోలీసులు మార్చురీలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.

మట్కారాయుళ్ల అరెస్ట్‌

మక్తల్‌: ఆన్‌లైన్‌లో మట్కా ఆడుతున్న ముగ్గురిని గురువారం అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ రాంలాల్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు.. పట్టణానికి చెందిన తాజ్‌, చాంద్‌పాషా, కుర్వ నర్సప్ప కళ్యాన్‌ అనే ఆన్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వారితో పాటు మరికొందరితో మట్కా ఆడిస్తున్నారని.. వారికి వచ్చిన డబ్బులో 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నట్లు వివరించారు. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ గేమ్‌, జూదం, మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ వంటి ఆటలు ఆడి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్‌ఐ పర్వతాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement