
అవుట్ డోర్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు
జడ్చర్ల: పోలీస్ శాఖలో పదోన్నతి పొందడానికి కావాల్సిన అర్హత పరీక్షలలో భాగంగా మంగళవారం జడ్చర్ల పోలీసు శిక్షణ కేంద్రంలో అవుట్‌డోర్, క్రైం సీన్ అబ్జర్వేషన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐలు ఎస్‌ఐగా పదోన్నతి పొందడానికి కావాల్సిన అర్హత పరీక్షను అధికారులు నిర్వహించారు. చార్మినార్ జోన్‌తోపాటు యాదాద్రి జోన్‌కు సంబంధించిన అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ నర్సింహ, నల్లగొండ ఎస్పీ అపూర్వరావు, 12వ బెటాలియన్ సాంబయ్య, ఏఎస్పీ రాములు తదితరులు పర్యవేక్షించారు.