
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ రవినాయక్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ‘ప్రజావాణి’కి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్ద ని కలెక్టర్ రవినాయక్ అన్నారు. కార్యక్రమంలో భా గంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ను తిప్పుకోకుండా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ అనిల్‌కుమార్, డీఆర్‌డీఓ యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గత సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు దినోత్సవాన్ని రద్దు చేశారు. దీంతో ఈ వారం ప్రజలు పెద్దసంఖ్యలో తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చారు. అయితే ఉదయం 10 గంటల నుంచే ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు రాగా.. కలెక్టర్ రాకపోవడంతో ఎదురుచూపులు తప్పలేదు.