మా ఊరు గండిరామవరం. పచ్చదనానికి పెట్టింది పేరు. మా ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. ఆది ‘మ ల్లన్న గండి’. ఇక్కడికి చాలామంది పర్యాటకులు వస్తారు. ఊరు చుట్టూ కొండలు ఉంటాయి. మధ్యలో మల్లన్నగండి అందాలు కనిపిస్తాయి. కొండల పక్కనే పచ్చని పొలాలు.. వాటి పక్కన జంతువులు, పక్షుల కిలకిలరావాలు వినిపిస్తాయి. మల్లన్న గండి చెంతన సమ్మక్క, సారక్క దేవతలు ఉన్నారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది. ఇవి మాఊరి ముచ్చట్లు.
జె.అనిల్, 9వ తరగతి, ప్రభుత్వ
ఉన్నత పాఠశాల, నర్మెట
నా కళ
–జనగామ
నా పేరు కొత్తమాసు విన్యశ్రీ. నేను జనగామ మండలం వడ్లకొండ ప్రా థమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నా. భవిష్యత్తులో నేను ఒక మంచి విద్యాసంస్థకు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించి విద్యార్థులను భావి భారత పౌరులు తీర్చిదిద్దాలని నా కళ.


