కిడ్నాప్‌ హైడ్రామా! | - | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ హైడ్రామా!

Feb 17 2026 8:41 AM | Updated on Feb 17 2026 8:41 AM

కిడ్న

కిడ్నాప్‌ హైడ్రామా!

కాంగ్రెస్‌ సభ్యుల బస్సు వద్ద టెన్షన్‌..

వాయిదా పడిన మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

జనగామలో

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

జనగామ: జనగామ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో ఉత్కంఠ నెలకొంది. 28వ వా ర్డు బీఆర్‌ఎస్‌ సభ్యురాలు ఎండీ హఫీజ్‌ ఫాతిమా, ఆమె భర్త సోదరుడు సమ్మద్‌ను ఎమ్మెల్యే కిడ్నాప్‌ చేశారని ఆమె బావ అక్బర్‌ మహమూద్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే కొద్ది గంటల్లోనే హఫీజ్‌ ఫాతిమా స్వయంగా ముందుకొచ్చి తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదంటూ పోలీసుల సమక్షంలో మీడియాకు వెల్లడించారు. ఇదేక్రమంలో మున్సిపల్‌ స మావేశపు హాల్‌లో చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎఫ్‌ఐఆర్‌ ఉన్న నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు ఎన్నిక నిలిపివేయాలని అభ్యంతరం తెలిపా రు. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న స్వతంత్ర సభ్యుడు మారబోయిన పాండు, ఇద్దరు ఇండిపెండెంట్లు, సీపీఎం సభ్యులు కలిసి పోడియం వద్ద బైఠాయిస్తూ ఎన్నిక వాయిదా వేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఇరు పార్టీలకు కోరం ఉన్న నేపథ్యంలో వాయిదా వేయలేమని ఎన్నికల అధికారులు స్పష్టం చేసినా వినిపించుకోలేదు. స్వయంగా సభ్యురాలు కిడ్నాప్‌ చేయలేదని చెబుతున్నా, అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఎన్నిక వాయిదా పడేలా చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సభ్యులు అరగంటపాటు నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో జనగామ ఆర్డీఓ గోపిరాం ఎన్నికను నేటి(మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ పరిణామాలపై అధికారులు ప్రభుత్వ తొ త్తుల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ సభ్యులు మున్సిపల్‌ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. ఒక్క ‘కిడ్నాప్‌ కేసు’తో ఎన్నిక వాయిదా పడడంతో ఇరు పార్టీల త దుపరి వ్యూహాలపై జిల్లా రాజకీయం వేడెక్కింది.

కాంగ్రెస్‌ శ్రేణుల మోహరింపు :పెంబర్తి వద్ద ఉద్రిక్తత

మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన బీఆర్‌ఎస్‌ సభ్యులు క్యాంపు నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి బయలు దేరారు. వరంగల్‌–హైదరాబాద్‌ హైవేపై జనగామ మండలం పెంబర్తికి చేరుకున్నారు. ఈ సమయంలో జనగామ కు చెందిన బీఆర్‌ఎస్‌ సభ్యులు వస్తున్నారని అనుకుని ఎంపీ కిరణ్‌కుమారెడ్డి వర్గీయులు తొర్రూరుకు చెందిన బీఆర్‌ఎస్‌ సభ్యుల వాహనాన్ని (బస్సు) అడ్డుకున్నారు. అదే సమయంలో ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి అక్కడే ఉన్నారు. ఈ సమయంలో బస్సును అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్‌ శ్రేణులు(జనగామ) అక్కడకు చేరుకోవడంతో తోపులాట జరిగింది. ఎంపీ చామల.. కౌన్సిలర్లను బెదిరించి కిడ్నాప్‌ చేసే ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.

జనగామ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడడంతో సభ్యులను తిరిగి క్యాంపునకు తీసుకెళ్లే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే పార్టీకి చెందిన ఓ సభ్యుడి అనుచరులు అడ్డుకుని, తమ కౌన్సిలర్‌ను చూపించాలంటూ నినదించారు. వెంటనే ఎంపీ చామల, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు అక్కడకు వెళ్లారు. కార్యకర్తలకు నచ్చచెప్పి బస్సును మరో రూట్‌లో హైదరాబాద్‌ వైపునకు మళ్లించారు.

ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యుల ధర్నా

ఆయా పదవుల ఎన్నికకు వీడని ఉత్కంఠ

కిడ్నాప్‌ హైడ్రామా!1
1/2

కిడ్నాప్‌ హైడ్రామా!

కిడ్నాప్‌ హైడ్రామా!2
2/2

కిడ్నాప్‌ హైడ్రామా!

Advertisement
 
Advertisement
Advertisement