ముగిసిన నామినేషన్ల పర్వం
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో శుక్రవారం 244 నామినేషన్లు దాఖలైనట్లు కమిషనర్ టి రాజేశ్వర్ తెలిపారు. ఈనెల 28న 10, 29న 103, శుక్రవారం 244 మొత్తంగా 357 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో ఐదు గంటల తర్వాత క్యూలో ఉన్న వారి నామినేషన్లు స్వీకరించారు. హెల్ప్‌డెస్క్‌లో అభ్యర్థులు వారి సందేహలను నివృత్తి చేసుకున్నారు. చివరి రోజు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
డోర్నకల్‌లో 146..
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో శుక్రవారం 96 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 131మంది అభ్యర్థులు 146 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 75, బీఆర్‌ఎస్ నుంచి 40, బీజేపీ నుంచి 14, ఇండిపెండెంట్లు 13, సీపీఎం నుంచి 2, బీఎస్‌పీ 1, జనసేన నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ తెలిపారు. సీఐ చంద్రమౌళి, తహసీల్దార్ రాఘవరెడ్డి, డీటీ వీరన్న పర్యవేక్షించారు.
మరిపెడలో 142..
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీలో 15వార్డులకు 142 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు 2, రెండో రోజు 32, చివరిరోజు శుక్రవారం 108 నామినేషన్లు వేశారు.
తొర్రూరులో 144..
తొర్రూరు: తొర్రూరులో చివరిరోజు 93 నామినేషన్లు దాఖలు కాగా.. మొత్తంగా 144 దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ వి. శ్యామ్‌సుందర్ తెలిపారు. కాంగ్రెస్–41, బీఆర్‌ఎస్–51, బీజేపీ–32, సీపీఎం–5, బీఎస్పీ–3, ఇతర పార్టీల నుంచి 4, స్వతంత్రుల నుంచి 8 నామినేషన్లు దాఖలయ్యాయి.
కేసముద్రంలో 167
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలో 167 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండోరోజు 58 నామినేషన్‌లు దాఖలు కాగా శుక్రవారం 109 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి 76, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 53, బీజేపీ నుంచి 22, ఇండిపెండెంట్‌గా 13, సీపీఎం నుంచి 1, డీఎస్పీ నుంచి 1, ఎంసీపీఐ(యూ) నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్లు తెలిపారు.
5 మున్సిపాలిటీల్లో 956..
మానుకోటలో 357 నామినేషన్లు దాఖలు


