యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ ప్రారంభించామని, ప్రస్తుతం యూరియా అమ్మకాలు పూర్తిగా యాప్ ద్వారానే నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.సరిత శుక్రవారం తెలిపారు. అన్ని మండలాల్లో యూరియా బుకింగ్ వ్యవస్థ సజావుగా అమలయ్యే విధంగా చర్యలు ఉంటామన్నారు. యాప్ ఆధారిత బుకింగ్ విధానం వలన పారదర్శకత, సులభమైన పద్ధతిలో సకాలంలో యూరియా రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ వలంటీర్లు రైతులకు యూరి యా బుకింగ్ యాప్ వినియోగ విధానంపై మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీపై నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు. అర్హులైన రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా చేస్తుందన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.సరిత


