పశు సంపద అభివృద్ధితో ఆర్థిక చేయూత
మహబూబాబాద్ రూరల్ : రైతులు పశు సంపద అభివృద్ధితో ఆర్థిక చేయూత లభిస్తుందని వరంగల్ మామునూరు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బిందుమాధురి అన్నారు. పీవీ నర్సింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం, సత్గురు మేనేజమెంట్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో యాంటి మైక్రోబియల్ నిరోధకత, పరిష్కారాలు అంశంపై రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బిందుమాధురి పాడి రైతులకు యాంటీబయాటిక్స్ వాడకం, వాటిమోతాదు ఎక్కువగావాడితే క లిగే నష్టాల గురించి తెలియజేశారు. లింగ సమానత్వం, యాంటీబయాటిక్స్ ప్రత్యామ్నాయాలు, టీ కాల ప్రాముఖ్యత, ప్రాచీన పశువైద్యంపై అవగా హన కల్పించారు. అనంతరం రైతులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సాయికిరణ్, మల్యాల కేవీకే సమన్వయకర్త దిలీప్ కుమార్, సత్గురు మేనేజ్‌మెంట్ బాధ్యులు ఉపేంద్ర, కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.


