మేడారానికి పోటెత్తిన భక్తులు
వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో సుమారు 50 వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించారు. శివసత్తుల పూనకం, భక్తిగీతాల ఆలాపన, భక్తుల సందడితో జంపన్న వాగు కోలాహలంగా మారింది. పసుపు, కుంకుమ, ఎత్తు బంగా రం, చీరసారె సమర్పించి చల్లగా చూడాలని తల్లులను భక్తులు వేడుకున్నారు. అనంతరం అడవిలో చెట్లకింద వంటలు వండుకొని భోజనాలు చేశారు.
– ఎస్‌ఎస్ తాడ్వాయి
మేడారంలో సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటున్న భక్తులు
మేడారానికి పోటెత్తిన భక్తులు


