అవార్డుకు ఎంపిక
దంతాలపల్లి: స్థానిక తహసీల్దార్ సునిల్ కుమార్ ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశిష్ట సేవలు అందించినందుకుగాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సునిల్‌కుమార్ ఈ అవార్డు అందుకోనున్నారు.
ఆడపిల్లలపై వివక్ష సరికాదు
మహబూబాబాద్ అర్బన్: ఆడపిల్లలపై వివక్ష సరికాదని జిల్లా న్యాయ సేవా అధికారం సంస్థ అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్‌కృష్ణ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని జమాండ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం జిల్లా న్యాయ సేవా అధికారం సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కృష్ణ మాట్లాడుతూ.. ఆడపిల్లలు విద్య, బాల్యవివాహలు, చట్టపరమైన ఉచిత న్యాయ సహా యానికి అర్హుని తెలిపారు. బాలికల సమస్యల ఫిర్యాదుకు చైల్డ్‌లైన్ హెల్ఫ్‌లైన్ నంబర్ 1098, ఉచిత న్యాయ సేవల కోసం 15100 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సమ్మెట వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలురతో సమానంగా బాలికలను చూడాలి
బయ్యారం: బాలురతో సమానంగా బాలికలను చూసే దృక్పథం ఇంటి నుంచే ప్రారంభం కావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ న్యాయవాది చెన్నమల్లారెడ్డి అన్నా రు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మండలంలోని జగ్గుతండా కస్తుర్బాగాంధీ బాలికల పాఠశాలలో వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. లింగవివక్షతతోనే కుటుంబతగదాలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలపై తల్లిదండ్రులు తమ దృక్పథాన్ని మార్చుకుంటేనే సమాజంలో సైతం మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నీలిమ పాల్గొన్నారు.
గట్టమ్మతల్లికి భక్తుల మొక్కులు
ములుగు రూరల్: మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులు ముందుగా ఆదిదేవత గట్టమ్మ తల్లి కి మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ మేరకు శనివా రం గట్టమ్మ ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనానికి బయలుదేరిన భక్తులు మొదటి మొ క్కుల గట్టమ్మ తల్లిని దర్శించుకొని పుసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెలకు పుసుపు–కుంకుమలు సమర్పించారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
అవార్డుకు ఎంపిక


