అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బైక్..
బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట వద్ద జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌కు చెందిన బోదాసు శ్రీకాంత్ (30) వ్యక్తి గత పనుల నిమిత్తం బైక్‌పై సిద్దిపేట జిల్లా చేర్యాలకు వెళ్లాడు. తిరిగి ఇంటికొస్తున్న క్రమంలో చుంచనకోట సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాంత్ ఎగిరి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందాడు. బావి పక్కనే బైక్ ఉండడంతో గమనించిన చుట్టు పక్కల వారి సమాచారం మేరకు పోలీసులకు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చేర్యాల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాణి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో పడమటికేశ్వాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎగిరి పక్కనే ఉన్న బావిలో పడి
యువకుడి మృతి
పడమటికేశ్వాపూర్‌లో విషాదం


