భార్య కాపురానికి రావడం లేదని..
మరిపెడ రూరల్: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..మరిపెడ మండలం తాళ్లఊకల్ గ్రామానికి చెందిన కలంచర్ల నవీన్(25)కు సూర్యాపేట జిల్లా పాలర్లపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో కొంత కాలంగా కుటుంబంలో తగదాలు చోటు చేసుకోడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం అత్తారింటికి వెళ్లిన నవీన్.. భార్యను కాపురానికి పంపించాలని వేడుకోగా ససేమిరా అన్నారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్.. ఇంటికొచ్చి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త.. చికిత్స పొందుతూ మృతి
తాళ్లఊకల్ గ్రామంలో ఘటన


