ఓటెత్తిన పల్లె..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగిన పోలింగ్‌కు ఓటర్లు బారులుదీరారు. ఓటర్లు పట్టణాలు, నగరాల నుంచి స్వగ్రామాలకు తరలొచ్చి ఓట్లు వేయడంతో సందడి నెలకొంది. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లను స్థానికులు, సర్పంచ్ అభ్యర్థులు వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేశారు.
ఎన్నికల విధుల్లో ఎంపీడీఓకు అస్వస్థత.. మృతి
వెంకటాపురం(కె) : ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్(58) అస్వస్థతకు గురయ్యారు. బు ధవారం సాయంత్రం ఓట్ల లెక్కింపు సమయంలో ఆరో గ్య సమస్య తలెత్తడంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
తగ్గిన ఓటింగ్..
● 2019 కన్నా తక్కువ పోలింగ్ ..
హన్మకొండ అర్బన్: జిల్లాలో 2019 జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పు డు 7 మండలాల్లోని మొత్తం 130 జీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఒంటిమామిడిపల్లి మినహా మిగతా 129 జీపీలకు మూడు విడతల్లో నిర్వహించారు. తర్వాత మండలాలు మారడంతో ప్రస్తుతం 12 మండలాల పరిధిలో జీపీ ఎన్నికలు జరిగాయి. మొత్తం రెండు ఎన్నికలు పోల్చిస్తే అప్పుడే జిల్లాలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పటి ఎన్నికల్లో ఐనవోలు మండలంలో 90 శాతం పోలింగ్ నమోదైంది.
గత, ప్రస్తుత పోలింగ్ వివరాలు
ఫేజ్ 2019 పోలింగ్ 2025 పోలింగ్
శాతం శాతం
మొదటి 89.02 83.95
రెండు 86.83 87.34
మూడు 88.80 86.44
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..
ఓటెత్తిన పల్లె..


