క్రీడలతో స్నేహభావం
● రెవరెండ్ ఫాదర్ థామస్‌కిరణ్
స్టేషన్‌ఘన్‌పూర్: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని రెవరెండ్ ఫాదర్ థామస్‌కిరణ్ అన్నారు. ఫాదర్ కొలంబో స్మారకార్థం బుధవారం స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను రెవరెండ్ ఫాదర్ థామస్‌కిరణ్, సీనియర్ క్రీడాకారుడు విద్యాసాగర్, మాజీ ఎంపీటీసీ దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా థామస్‌కిరణ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటమిలు సహమజని, అందరూ స్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. కాగా, బోనగిరి విద్యాసాగర్ మాట్లాడుతూ తన తండ్రి ఎల్లయ్య జ్ఞాపకార్థం విజేతలకు బహుమతులు అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బొల్లు వాసు, చింత ప్రణయ్, మారెపల్లి ప్రసాద్, సీనియర్ క్రీడాకారులు అంబటి కిషన్‌రాజ్, పెసరు సారయ్య, గజ్జెల్లి రాజు, మాతంగి కుమార్, ఆరోగ్యం, ఆకారపు అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.


