కాళేశ్వరం సర్పంచ్‌కి 1,010ఓట్ల మెజారిటీ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి సమీప కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెంగని అశోక్‌పై 1,010 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడు. బుధవారం మూడో విడతలో ఎన్నికలు జరగగా..2,700 ఓటర్లు ఉండగా 2,315 ఓట్లు పోలయ్యాయి. బరిలో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. అందులో మోహన్‌రెడ్డికి 1,497 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి మెంగని అశోక్‌కు 487 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి సంతోష్ 156, బీజేపీ బలపర్చిన మరో అభ్యర్థికి 56 ఓట్లు వచ్చాయి. మిగతావి నోటా, చెల్లని ఓట్లు ఉన్నాయి. దీంతో ప్రత్యర్థి అశోక్‌పై మోహన్‌రెడి 1,010ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన భార్య వెన్నపురెడ్డి వసంత గతంలో సర్పంచ్‌గా, మహదేవపూర్ ఎంపీపీగా పదవులు నిర్వర్తించారు.
కాళేశ్వరం సర్పంచ్‌కి 1,010ఓట్ల మెజారిటీ


