పరదాల చాటునే ఓటు హక్కు..
కొత్తగూడ: పరదాల చాటునే ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాటివారివేంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండే గదులు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో ఆరు వార్డులు, 530 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో మూడు వార్డుల పోలింగ్ పాఠశాలలో, మూడు వార్డుల పోలింగ్ నిర్వహణకు అసంపూర్తి జీపీ భవనంలో ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా, గ్రామ పంచాయతీ భవనం చుట్టూ కిరాయి పరదాలు చుట్టి మూడు గదులుగా ఏర్పాటుచేశారు. ఏర్పాట్లను ఆర్వో శ్రీధర్ పరిశీలించి రెండు చోట్ల పోలింగ్ నిర్వహించడం వల్ల అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు.


