వేసవిలో డిమాండ్ ఎదుర్కోవాలి
హన్మకొండ: వచ్చే వేసవిలో డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. సోమవారం హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్‌కో జోనల్ కార్యాలయంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ డీఈలు, ఏడీఈలు, ఏఈల సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్‌తో కలిసి డైరెక్టర్ టి.మధుసూదన్ సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలు పెరుగుతాయని, దీంతో డిమాండ్ పెరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు.


