సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన

Dec 15 2025 12:18 PM | Updated on Dec 15 2025 12:18 PM

సాక్ష

సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన

కాజీపేట: సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి శివారులోని తాళ్ల పద్మావతి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన సాక్షి స్పెల్‌బీ సెమీ ఫైనల్‌ రౌండ్‌ పరీక్షకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు అక్షర దోషం లేకుండా పదాలు రాయడం.. వాటిని ఎలా పలకాలో క్లుప్తంగా వివరించడానికి.. కొత్త ఇంగ్లిష్‌ పదాలు తెలియపరిచేలా ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కేటగిరీల వారీగా పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు కేటగిరీ 2, 4, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు కేటగిరీ 1, 3 విభాగాల్లో పరీక్షలను ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. కేటగిరీ – 1లో 1, 2 తరగతి విద్యార్థులు, కేటగిరీ–2 లో 3, 4, కేటగిరీ – 3లో 5, 6, 7, కేటగిరీ – 4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు పరీక్షలు రాశారు. వరంగల్‌ రీజీయన్‌ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి సుమారు 400 మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి డ్యూక్స్‌ వ్యాపీ ప్రెజెంటింగ్‌ స్పాన్సర్‌గా, ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, రాజమండ్రి అసోసియేట్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో సాక్షి వరంగల్‌ బ్యూరో ఇన్‌చార్జ్‌ గడ్డం రాజిరెడ్డి, ఈవెంట్స్‌ మేనేజర్‌ ఎన్‌.సుమన్‌ గుప్తా, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ లింగయ్య, తాళ్లపద్మావతి విద్యా సంస్థల డైరెక్టర్లు తాళ్ల వంశీ, చైతన్య, ప్రిన్సిపాల్‌ సౌమ్య, సిబ్బందితో పాటు సాక్షి బృందం పాల్గొంది.

విద్యార్థులకు నాలెడ్జ్‌ ఇంప్రూవ్‌ అవుతుంది..

స్పెల్‌ బీ పరీక్షతో విద్యార్థులలో నాలెడ్జ్‌ ఇంప్రూవ్‌ అవుతుంది. ప్రతీ సంవత్సరం స్కూల్‌లో ఒలంపియాడ్‌తో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పరీక్షలు చాలా రాస్తుంటా. అన్నింటికంటే సాక్షి స్పెల్‌బీ పరీక్ష బాగుంది. విద్యార్థుకు చాలా ఉపయోగపడే పరీక్ష.

కె.సాన్వికారెడ్డి, 9వ తరగతి,

షైన్‌ హైస్కూల్‌

కొత్త పదాలు తెలిశాయి..

నేను స్పెల్‌బీ సెమీ ఫైనల్‌ పరీక్ష రాశా. రెండు రౌండ్ల పరీక్షల కంటే సెమీఫైనల్‌ రౌండ్‌లో చాలా కొత్త పదాలు నేర్చుకున్నా. బుక్స్‌లో లేని పదాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకున్నా. పరీక్ష బాగా రాశా. ఫైనల్‌ రౌండ్‌కు కూడా ఎంపికవుతా.

– ఎన్‌.ప్రదీప్‌ కుమార్‌, 2వ తరగతి,

ఎస్‌వీఎం సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఖమ్మం

విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తున్న సాక్షి స్పెల్‌ బీ..

ఇంగ్లిష్‌ను ఇష్టంగా నేర్చుకుంటా. స్పెల్‌ బీతో విద్యార్థుల మధ్య ఆరోగ్యకర పోటీ ఏర్పడుతుంది. ఇలాంటి పోటీ పరీక్షలతో విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే అవకాశం సాక్షి కల్పించడం అభినందనీయం.

– పి.సాన్వి, 7వ తరగతి, తాళ్ల పద్మావతి ఒలంపియాడ్‌ స్కూల్‌

ఉత్సాహంగా పరీక్షకు హాజరైన విద్యార్థులు

ముగిసిన సెమీఫైనల్‌ రౌండ్‌

సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన1
1/2

సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన

సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన2
2/2

సాక్షి స్పెల్‌బీ సెమీఫైనల్‌కు విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement