తేలిన లెక్క..
మహబూబాబాద్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. కాగా, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఈనెల 4వ తేదీన అధికారులు వెల్లడించారు. కాగా 155 సర్పంచ్ స్థానాలకు గానూ 9 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 146 సర్పంచ్ స్థానాలకు 468 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,338 వార్డుల్లో 266 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,072 వార్డులకు 2,391 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
9జీపీలు,
266 వార్డులు
ఏకగ్రీవం..
జిల్లాలోని ఐదు మండలాల్లో తొలివిడత జీపీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా ఐదు మండలాల్లోని 155 జీపీలకు 9గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. గూడూరు మండలంలో ఒక గ్రామ పంచాయతీ, ఇనుగుర్తి 2, కేసముద్రం 3, మానుకోట 2, నెల్లికుదురు మండలంలో ఒక గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయ్యాయి. అలాగే గూడూరు మండలంలో 36వార్డులు, ఇనుగుర్తి 30, కేసముద్రం 60, మానుకోట 76, నెల్లికుదురు మండలంలో 64 వార్డులు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఈనెల 11వ తేదీ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాలు విడుదల చేస్తారు.
మొదటి విడతలో 155 జీపీల్లో
9జీపీలు ఏకగ్రీవం
1,338 వార్డులకు 266 ఏకగ్రీవం
మిగిలిన 146 సర్పంచ్‌స్థానాల
బరిలో 468మంది అభ్యర్థులు
1,072 వార్డుల్లో 2,391మంది పోటీ
ఈనెల 11న పోలింగ్
బరిలో నిలిచిన వార్డు అభ్యర్థులు
మండలం వార్డులు బరిలో ఉన్న అభ్యర్థులు
గూడూరు 318 730
ఇనుగుర్తి 82 167
కేసముద్రం 194 442
మానుకోట 262 578
నెల్లికుదురు 216 474
మొత్తం 1,072 2,391
మండలం జీపీలు బరిలో ఉన్న
అభ్యర్థులు
గూడూరు 40 120
ఇనుగుర్తి 11 34
కేసముద్రం 26 82
మానుకోట 39 129
నెల్లికుదురు 30 103
మొత్తం 146 468


