డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: మానుకోటను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అౖద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం నేషనల్ నార్కోటిక్స్ కో–ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరైనా మా దక ద్రవ్యాల రవాణా, వినియోగం చేస్తే చట్ట పర మైన చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా యువతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని కళాశాలల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాలకు ఎవరూ బానిసకావొద్దన్నారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా పెట్టాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలు సేవించి ఆస్పత్రులకు వస్తే వారి వివరాలను పోలీస్ శాఖకు అందజేయాలన్నారు. అధికారులు గ్రామాల్లో డ్రగ్స్ తీసుకునే వారి వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలో విస్తృతంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, డీఎస్పీ తిరుపతి రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


