గర్భిణులకు అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: గర్భిణులకు తమ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. మెటర్న ల్ మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోగురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భి ణులు తప్పకుండా చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు. హైబీపీ, ఎనిమియా, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఎదురైన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో వైదులను సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలను వినియోగించుకోవాలన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. మెటర్నల్ మరణాలు జరగకుండా సమన్వయంతో సిబ్బంది పని చేయాలని సూచించారు. సమావేశంలో గైనకాలజిస్ట్ శ్రీవిద్య, ప్రోగ్రాం ఆఫీసర్ సారంగం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి, డాక్టర్ ప్రత్యూష, మౌనిక, సురేష్, సద్విజ, కేవీ రాజు పాల్గొన్నారు.
డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్‌పై సమీక్ష..
జిల్లాలో పాఠశాలల విద్యార్థులను పరీక్షించి, ఏమైనా రుగ్మతలు ఉంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్‌కు పంపించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. డీఈఐసీ సెంటర్‌పై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పిల్లల్లో మానసిక రుగ్మతలు, దంతాల సమస్య, వినికిడి సమస్యలు తలెత్తితే సెంటర్‌కు పంపించి చికిత్స అందించాలని, జీజీహెచ్, ఎంజీఎంకు రెఫర్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి సు మన్‌కల్యాణ్, డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ సతీష్, కేవీ రాజు తదితరులు పాల్గొన్నారు.


