వైభవంగా కందగిరి జాతర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా కందగిరి జాతర

Nov 6 2025 9:22 AM | Updated on Nov 6 2025 9:22 AM

వైభవం

వైభవంగా కందగిరి జాతర

– మరిన్ని ఫొటోలు 9లోu

కనులపండువగా శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం

కురవి: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని కందికొండ గ్రామ శివారు కందగిరి(కందికొండ గుట్ట) పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మహోత్సవ జాతర బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన పూజారి పల్లాప్రోలు పురుషోత్తమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యే క పూజలు నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఏపీ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు భక్తులు కందికొండ గుట్ట ఉత్సాహంగా ఎక్కారు. గుట్టకు రెండు వైపులా నుంచి భక్తులు పైకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు.

వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు..

అయ్యగారిపల్లి వైపు నుంచి వచ్చిన భక్తులు గుట్ట కింద ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజ లు చేసి గుట్ట మధ్యలో ఉన్న గుహలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. కందికొండ గ్రామం వైపు నుంచి భక్తులు గుట్టను ఎక్కి శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. గుట్టపై ఉన్న కోనేటిలో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు కోనేటిలో ఉన్న ఈరజడ, ఇతర మొక్కలను తెంపి ఇంటికి తీసుకెళ్లారు.

భక్తులకు ఏర్పాట్లు..

జాతరకు వచ్చిన భక్తులకు కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ ఆదేశాల మేరకు తాగునీటి సౌకర్యం కల్పించారు. కురవి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్‌, రెవెన్యూ అధికారులు భక్తులకు ఇబ్బందులు రాకుండా చూశారు. ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌ ఆదేశాల మేరకు తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్‌ ఆధ్వర్యంలో మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్‌, సీరోలు ఎస్సై సంతోష్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల సేవలను భక్తులు మెచ్చుకున్నారు. ఆర్టీసీ బస్‌ సర్వీస్‌లను నడిపించింది.

దర్శించుకున్న ప్రముఖులు..

జాతరలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌ సందర్శించి పూజలు చేశారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ సతీమణి డాక్టర్‌ ప్రమీల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని గుట్ట మెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు అంబటి వీరభద్రంగౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, మలిశెట్టి వేణు, దయ్యాల శ్రీధర్‌, బస్వమణి, అడాన్య సుమన్‌, బొలుగొడ్డు సుశాంత్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గుగులోత్‌ వనజాశ్రీరామ్‌, ఐలి నరహరి, మన్యూ, బోడ శ్రీను, నెహ్రునాయక్‌, వెంకట్‌ గౌడ్‌, అర్జున్‌ చౌహన్‌ స్వామివారిని దర్శించుకున్నారు.

వెలిగిన అఖండ దీపం...

స్వామివారి కల్యాణం అనంతరం ఆలయ గోపురంపై అఖండ దీపాన్ని వెలిగించారు. రాత్రి జంగాల భాస్కర్‌ కుటుంబీకులు అఖండదీపాన్ని ఏర్పాటు చేసి వెలిగించారు. దీపం సుమారు 30 కిలోమీటర్ల పరిధి వరకు కనిపించడం విశేషం.

కందికొండ గుట్టపై మార్మోగిన గోవిందనామస్మరణ

భారీగా తరలివచ్చిన భక్తులు

వైభవంగా కందగిరి జాతర1
1/3

వైభవంగా కందగిరి జాతర

వైభవంగా కందగిరి జాతర2
2/3

వైభవంగా కందగిరి జాతర

వైభవంగా కందగిరి జాతర3
3/3

వైభవంగా కందగిరి జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement