‘హలో దళిత.. చలో ఢిల్లీ’
నయీంనగర్ : సీజేఐపై జరిగిన దాడిని ఖండిస్తూ, దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్‌ను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 20న చేపట్టిన హలో దళిత.. చలో ఢిల్లీ మహాధర్నాను జయప్రదం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభాకర్ మాదిగ పిలుపునిచ్చారు. హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడిపై ప్రధాని మోదీ విచారణకు ఆదేశించలేదని, కేవలం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారని ప్రభాకర్ ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు విల్సన్ మాదిగ, ఆశీర్వాదం, ఎడ్ల ఉపేంద్ర, ఎడ్ల సమ్మయ్య , సారన్న , మైపాల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.


