దళితుల ఆత్మగౌరవం కోసమే ‘చలో ఢిల్లీ’
నెహ్రూసెంటర్: దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలో చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ 15శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. దళితులపై జరుగుతున్న దాడులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. న్యాయ స్థానాలు, రాజ్యసభలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో గండమల్ల జానీ, బన్ను, చిన్ని, తిరుపతి, రామకృష్ణ, మహేశ్, నాగరాజు, అనిల్, రాములు, సుధాకర్, రవి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


