పొంచి ఉన్న ప్రమాదం
మహబూబాబాద్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శిథిలావస్థలో ఉన్న భవనాలతో ప్రమాదం పొంచి ఉంది. నిజాం కాలం నాటి భవనాల్లోనే ఇప్పటికీ పలు ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండగా అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ కార్యాలయాల నూతన భవనాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
తహసీల్దార్ కార్యాలయం..
జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలోనే కొనసాగుతోంది. ఆ భవనం వెనుకభాగం చాలా వరకు కూలిపోయింది. భవనం స్లాబ్ పెచ్చులూడిపోతున్నాయి. దీంతో భవనం ఎప్పడు కూలిపోతుందోనని బిక్కుబిక్కూమంటూ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని కార్యాలయాలు..
నిజాంకాలం నాటి భవనంలోనే ఇరిగేషన్ శాఖ కార్యాలయం కొనసాగుతోంది. ఆ భవనంలో చాలా గదులు కూలిపోయాయి. మిగిలిన గదుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తపాలా శాఖ కార్యాలయం కూడా నిజాంకాలం నాటి భవనంలోనే కొనసాగుతోంది. అలాగే కంకరబోడ్ ప్రాంతంలో బీఎస్ ఎన్‌ఎల్ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరి పిచ్చి మొక్కలు ఏపుగాపెరిగి పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలోనే మున్సిపాలిటీ క్వార్టర్స్ చాలా వరకు కూలిపోగా.. కొన్ని గదులు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నా యి. అలాగే ఆఫీసర్ క్లబ్ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇదిలా ఉండగా శిథిలావస్థ ఇళ్లలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గత ంలోనూఆ ఇళ్ల యజమానులకు నోటీస్‌లు ఇచ్చారు.
తుపానుతో శిథిలావస్థ భవనాలు
ఖాళీ చేయించాలని ఆదేశాలు
నిజాంకాలం నాటి భవనాల్లోనే పలు ప్రభుత్వ కార్యాలయాలు
బిక్కుబిక్కుమంటూవిధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది
ప్రతిపాదనలకే పరిమితమైన నూతన భవనాలు
పొంచి ఉన్న ప్రమాదం
పొంచి ఉన్న ప్రమాదం


