అతలాకుతలం..
– మరిన్ని ఫొటోలు 9లోu
జిల్లాను ముంచెత్తిన మోంథా తుపాను
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో జోరు వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. మోంథా తుపా ను ప్రభావంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో పత్తి పంటలు దెబ్బతిన్నగా, వరి, మొక్కజొన్న పంటలు నేలవా లాయి. రోడ్లు, కల్లాల్లో ఆరబోయిన ధాన్యం, మక్కలు తడిసి ముద్దవ్వడంతో రైతులు కన్నీరు మున్నీ రుగా విలపించారు. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందుల పడ్డారు. డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో పట్టా లపై వర్షపు నీరు నిలవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
అప్రమత్తం..
జిల్లాలో బుధవారం ఉదయం 5 గంటల నుంచే వాన మొదలైంది. ఈమేరకు కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈమేరకు ఎక్కడికక్కడే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు రోడ్లపై, వాగులు, ఇతర జలాశయాల వద్ద విధులు నిర్వర్తించారు. కాగా వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
పొంగిన వాగులు, వంకలు.. చెరువుల మత్తళ్లు
భారీ వర్షానికి జిల్లాలోని ఆకేరు, మున్నేరు, పాకాల, వట్టి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై నుంచి ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే నిజాం చెరువు, బంధం చెరువు, రాబంధు చెరువు, జనాల చెరువు, కంబాల చెరువు, ఈదులపూసపల్లి చెరువు మత్తళ్లు పోస్తున్నాయి. జిల్లాలో మహబూబాబాద్, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్, తొర్రూరు మున్సిపాలిటీల పరిధిలో పలు శివారు కాలనీలు నీట మునిగాయి. సైడ్ డ్రెయినేజీల నుంచి రోడ్లపైకి మురుగు నీరు ప్రవహించింది. అదేవిధంగా జిల్లా కేంద్రం ధర్మన్న కాలనీలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం జలమయమైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై నిలిచిన వర్షపునీరు
జలమయమైన ఇళ్లు.. ప్రజల ఇబ్బందులు
దెబ్బతిన్న పత్తి, నేలవాలిన వరి, మొక్కజొన్న పంటలు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
అలుగుపోస్తున్న పలు చెరువులు..పోలీసుల బందోబస్తు
పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
అతలాకుతలం..
అతలాకుతలం..
అతలాకుతలం..
అతలాకుతలం..
అతలాకుతలం..


