వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏ ర్పాటు చేసిన స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి ప రిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 28న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. స్పోర్ట్స్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, శాట్ వీసీ ఎండి సోనీబాలదేవితో సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 14వ తేదీలోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. కాగా, జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే కడియ శ్రీహరి జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
టీచర్ల శిక్షణ వాయిదా
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన టీచర్లు, నూతనంగా నియామకమైన ఎస్‌జీటీల శిక్షణ తేదీల్లో మా ర్పులు చేశారు. ఈనెల 30 నుంచి జరగాల్సిన శిక్షణను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు డీఈఓ డి.వాసంతి, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బండారు మన్మోహన్ బుధవారం సాయంత్రం తెలిపారు. ఈ మేరకు ఆరు జిల్లాల డీఈఓలకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ శిక్షణ నవంబర్ 6, 7 తేదీల్లో జీహెచ్‌ఎంలు, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంలు, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లకు, 10, 11 తేదీల్లో ఎస్‌జీటీలు, లాంగ్వేజెస్ స్కూల్‌అసిస్టెంట్లకు కలిపి మొత్తం 725 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని జెడ్పీహెచ్‌ఎస్, మడికొండ జెడ్పీహెచ్‌ఎస్, హనుమకొండ లష్కర్‌బజార్ గర్ల్స్ హైస్కూల్, ప్రాక్టీసింగ్ ప్రభుత్వ హైస్కూల్‌లో శిక్షణ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
కేయూ క్యాంపస్: భారీ వర్షాల కారణంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 30న నిర్వహించనున్న ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల నాలుగో సెమిస్టర్, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ఎనిమిదో సెమిస్టర్ పరీక్షలు, బీటెక్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ బుధవారం తెలిపారు. మిగతా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 30 జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 30, 31 తేదీల్లో నిర్వహించనున్న అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ మీట్‌ను వాయిదా వేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. భారీవర్షాల కారణంగా వాయిదా వేశామని, మళ్లీ నిర్వహించే తేదీ త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
తప్పిపోయిన బాలుడి అప్పగింత
గీసుకొండ: తప్పిపోయిన బాలుడిని పోలీసులు తండ్రికి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బంగారుగూడకు చెంది న ధారవేణి శివన్న 15 ఏళ్ల కుమారుడు హర్షిత్ మంగళవారం తప్పిపోయి తిరుగుతుండగా ధర్మారానికి చెందిన నవయుగ యూత్ సభ్యులు పోలీసులకు అప్పగించారు. వివరాలు సేకరించిన ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్.. ఆ బాలుడిని బుధవారం తండ్రి శివన్నకు అప్పగించారు. దీంతో బాలుడి తండ్రి.. పోలీసులతో పాలు నవయుగ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి అనుమతి


