రైల్వే కాలనీలోకి వరద నీరు...
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్‌లోకి పోటెత్తిన వరద దిగువ ప్రాంతంలోని రైల్వే క్వార్టర్స్‌లోకి చేరడంతో రైల్వే ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రైల్వే స్టేషన్ మీదుగా వరదనీరు రైల్వే పార్కు నుంచి పక్కన ఉన్న క్వార్టర్స్‌లోకి చేరడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. అకస్మాత్తుగా ఇళ్లలోకి వరద చేరడంతో ఫర్నిచర్‌తో పాటు సామగ్రి నీట మునిగింది. వృద్ధులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు.
అధికారుల సమీక్ష...
భారీ వర్షాలపై కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి సమీక్షించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో గోల్కొండ రైలు ప్రయాణికులతో పాటు రైల్వే అధికారులతో మా ట్లాడారు. అంబేడ్కర్‌నగర్‌లో రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరదను కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇమ్మానియల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే కాలనీలోకి వరద నీరు...
రైల్వే కాలనీలోకి వరద నీరు...


