అన్నదాతల ఆశలపై నీళ్లు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో భారీ వర్షం వల్ల పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 2,15,723 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 50 శాతానికిపైగా పంటలకు నష్టం వాటిల్లింది. 62,751 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా.. అధిక మొత్తంలో మొక్కజొన్న కంకులను కోసి విక్రయించేందుకు కల్లాలు, అనువుగా ఉన్న ప్రాంతాల్లో రైతులు ఆరబోసుకున్నారు. వర్షంతో మక్కలు తడిసి ముద్దయ్యాయి. 70నుంచి 80శాతం వరకు నష్టం వాటిల్లింది. 86,224 ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. ప్రస్తుతం కోత దశలో 60 శాతానికిపైగా నష్టం జరిగింది. 38,289 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా పూత 40శాతం వరకు రాలిపోయినట్లు రైతులు పేర్కొన్నారు.
అన్నదాతల ఆశలపై నీళ్లు


