సత్ఫలితాలు.. | - | Sakshi
Sakshi News home page

సత్ఫలితాలు..

Oct 17 2025 6:14 AM | Updated on Oct 17 2025 6:14 AM

సత్ఫల

సత్ఫలితాలు..

బయోమైనింగ్‌ ప్లాంట్‌లో

80 శాతం చెత్త శుద్ధి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

డంపింగ్‌ యార్డులో ఏర్పాటు

సిమెంట్‌ ముడి పదార్థాలతో పాటు ఎరువుల తయారీ

హై జంప్‌ చేస్తున్న క్రీడాకారుడు

పరుగు పోటీలో తలపడుతున్న మహిళా అథ్లెట్లు

లాంగ్‌జంప్‌ చేస్తున్న అథ్లెట్‌

మహబూబాబాద్‌: చెత్తను శుద్ధి చేయడంతో పాటు ముడి పదార్థాల తయారీ కోసం మానుకోట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బయో మైనింగ్‌ ప్లాంట్‌ సత్ఫలితాలు ఇస్తోంది. కాగా మున్సిపాలిటీలో పదేళ్లుగా పేరుకుపోయిన చెత్తలో 80శాతం క్లీన్‌ కావడంతో పాటు ఆదాయం సమకూరే ముడిపదార్థాలను తయారు చేస్తున్నారు. దీంతో పర్యావరణ సమస్య పరిష్కారంతో పాటు ఆదాయం వస్తోందని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. కాగా బయోమైనింగ్‌ ప్లాంట్‌ నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు.

మున్సిపాలిటీలో 143మంది

పారిశుద్ధ్య కార్మికులు..

మానుకోట మున్సిపాలిటీలో అవుట్‌ సోర్సింగ్‌లో 205 మంది పని చేస్తున్నారు. వారిలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరణ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సిగ్నల్‌ కాలనీ సమీపంలో, గాంధీపురం శివారులో డంపింగ్‌ యార్డుల్లో చెత్తను డంప్‌ చేస్తున్నారు. కాగా, 2022లో మానుకోట మున్సిపాలిటీకి బయోమైనింగ్‌ ప్లాంట్‌ మంజూరైంది. సిగ్నల్‌ కాలనీలో ప్లాంట్‌కు స్థలం కేటాయించగా.. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిధులు రూ.1.20కోట్లతో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్లాంట్‌ నుంచి తయారీ పదార్థాలు..

మానుకోట మున్సిపాలిటీలో ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఇందులో ఒక టన్ను పొడి చెత్తను.. పొడిచెత్త సేకరణ కేంద్రం( డీఆర్‌సీ సెంటర్‌)కు తరలిస్తున్నారు. ఇందులో బాటి ళ్లు, అట్టాలు, సీసాలు, ప్లాస్టిక్‌ ఇతర వస్తువుల ను తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తోంది. ఒక టన్ను తడి చెత్తను కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నారు. దీంతో ఎరువులు తయారు చేస్తున్నారు. ఆ ఎరువులను నర్సరీలకు, డివైడర్లలో ఉన్న మొక్కలను ఉపయోగిస్తున్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. మిగిలిన 31 టన్నుల చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తుండగా దానిని బయోమైనింగ్‌ ప్లాంట్‌లో ఉపయోగిస్తున్నారు. ఆ చెత్త నుంచి ఆర్‌డీఎఫ్‌ ఇంధన పదార్థాలు, సిమెంట్‌ ముడి పదార్థాలు, బయో ఎరువులు తయారు అవుతున్నాయి. ఆ ఎరువుల్లో కెమికల్స్‌ ఎక్కువగా ఉన్నందున పండ్ల మొక్కలకు మినహా ఇతర అన్ని మొక్కలకు ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. ఆర్‌డీఎఫ్‌ను కర్నూల్‌ జిల్లాలోని పలు సిమెంట్‌ కంపెనీలకు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

క్లీన్‌ క్లీన్‌..

బయో మైనింగ్‌ ప్లాంట్‌ వల్ల మానుకోట మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డులోని చెత్త మొత్తం క్లీన్‌ అవుతోంది. ప్లాస్టిక్‌ కవర్లన్నీ ప్లాంట్‌లోనే శుద్ధి అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో ప్లాంట్‌ దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. మూడు నెలలకోసారి ఆర్‌డీఎంఏతో పాటు సంబంఽధిత అధికారులు ఆప్లాంట్‌ను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. గత నెల 25న ఆర్‌డీఎంఏతో పాటు అధికారులు ప్లాంట్‌ను సందర్శించి నిర్వహణ ఇతర అన్ని వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా ఆ ప్లాంట్‌ సక్సెస్‌ కావడంతో ప్రభుత్వం త్వరలో జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.

బయో మైనింగ్‌ ప్లాంట్‌ సక్సెస్‌

మానుకోటలో ఏర్పాటు చేసిన బయో మైనింగ్‌ ప్లాంట్‌ సక్సెస్‌ అయ్యింది. మున్సిపాలిటీలోని డంపింగ్‌ యార్డుల్లో ఉన్న చెత్త దాదాపు క్లీన్‌ అయ్యింది. దాని నుంచి ఎరువులు తయారీ జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో ప్లాంట్‌ చాలా దోహదపడుతోంది.

– రాజేశ్వర్‌,

మానుకోట మున్సిపల్‌ కమిసనర్‌

చెత్త సమస్య

చాలా వరకు తీరింది

10 సంవత్సరాల చెత్తలో 80 శాతం క్లీన్‌ అయ్యింది. డంపింగ్‌ యార్డులో చెత్త సమస్య, ప్లాస్టిక్‌ కవర్ల సమస్య చాలా వరకు తీరింది. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఎరువులు, సీ అండ్‌ వేస్ట్‌ పదార్థాలు ఉపయోగపడుతున్నాయి. నూకల రాంచంద్రారెడ్డి పార్క్‌ నిర్మాణంలో ఉపయోగించారు.

– గుజ్జు క్రాంతి, పర్యావరణ అధికారి

సత్ఫలితాలు..1
1/3

సత్ఫలితాలు..

సత్ఫలితాలు..2
2/3

సత్ఫలితాలు..

సత్ఫలితాలు..3
3/3

సత్ఫలితాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement