
ఐఎంఎల్ పాలసీ అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు
మహబూబాబాద్ రూరల్: ఐఎంఎల్ పాలసీ– 2025–27అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని విని యోగించుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆర్.ప్రవీణ్ కుమార్ కోరారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో గురువారం ఆయన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇప్పటి వరకు 243 దరఖాస్తులు వచ్చాయని, రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నందువల్ల దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 23 ఉదయం 11గంటలకు పట్టణంలోని ఏబీ ఫంక్షన్ హాల్‌లో లైసెన్సుల కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 8గంటలకే ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలని, ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ సీఐలు చిరంజీవి, బిక్షపతి, అశోక్ పాల్గొన్నారు.