
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
కురవి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండలంలోని నేరడ గ్రామంలో మోడల్ స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల ఆవరణలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయ్‌లెట్స్, స్టడీ రూమ్స్, తరగతి గదులు, స్టోర్ రూం, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదిలో స్వయంగా పిల్లల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. ఏఐ డిజిటల్ తరగతుల బోధించాలని సూచించారు. మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలన్నారు. ఆరోగ్య, మానసిక సమస్యలపై కౌన్సెలింగ్ ఇవ్వాలని, వసతి గృహంలో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు తదితర ప్రదేశాల్లో క్రమం తప్పకుండా శానిటేషన్ నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిశీలన చేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలుకు సిద్ధం చేయాలి
మహబూబాబాద్: వానాకాలం ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనువైన ప్రదేశాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం రవాణా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఏఓ విజయనిర్మల, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్ ఉన్నారు.