
ప్రసవాల సంఖ్య పెంచాలి
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెల్లికుదురు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ సందర్శించి వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు, ప్రసవాల సంఖ్య, వ్యాక్సినేషన్, టీబీ వ్యాధిపై గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రసవాలపై ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శారద, సీహెచ్‌ఓ శాంతమ్మ, సూపర్‌వైజర్లు వసంత కుమారి, సుల్తానా, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాల తనిఖీ
బయ్యారం: మండలంలోని ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలను కొత్తగూడ ఏటీడబ్ల్యూఓ ఆర్.భాస్కర్‌రావు గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మెనూతో పాటు వంటగదులు, టాయిలెట్లు, డార్మెటరీ హాల్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. విద్యార్థ్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం బి.శోభన్‌బాబు, వార్డెన్ లాలయ్య తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే
సంపూర్ణ ఆరోగ్యం
తొర్రూరు రూరల్: పౌష్టికాహారంతోనే గర్భిణులు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ సబిత అన్నారు. గురువారం మండలంలోని వెలికట్ట గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతాలు నిర్వహించారు. ఈసందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులతో పాటు ప్రతీ ఒక్కరు పాలు, గుడ్లు, ఆకుకూరలు తదితర పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ పూర్ణచందర్, సీడీపీఓ కమలాదేవి, ఏసీడీపీఓలు విజయలక్ష్మి, సంకీర్తన, డాక్టర్ ఫాతిమా ఫరా, సూపర్‌వైజర్లు మల్లీశ్వరి, శ్రీదేవి, గౌసియా, సునీత, శోభ, నాగమణి, అశోక్, జ్యోతి, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తిమహ్మద్ అబ్దుల్ రఫీ
మహబూబాబాద్ రూరల్ : ఆరోగ్యమే మహాభాగ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సీపీఆర్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి పునర్జన్మనిచ్చే విధానమే సీపీఆర్ పద్ధతి అన్నారు. సీపీఆర్ వల్ల లయతప్పిన గుండెను తిరిగి పని చేయించేందుకు వీలుంటుందన్నారు. ఈ విధానంపై న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పద్ధతిలో అవగాహన కల్పించడం మహాభాగ్యం అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రసవాల సంఖ్య పెంచాలి

ప్రసవాల సంఖ్య పెంచాలి

ప్రసవాల సంఖ్య పెంచాలి