
కార్యకర్తల నిర్ణయం మేరకే అధ్యక్షుడి ఎంపిక
● ఏఐసీసీ అబ్జర్వర్ దెబాసిస్ పట్నాయక్
బయ్యారం: కార్యకర్తల నిర్ణయం మేరకే ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ దెబాసిస్ పట్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని కోదండ రామచంద్రస్వామి ఫంక్షన్‌హాల్‌లో గురువారం నిర్వహించిన బయ్యారం, గార్ల మండలాలస్థాయి కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియన్ కార్యక్రమం పేరుతో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీపడే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పార్టీలో సీనియార్టీ, అనుబంధ సంఘాలతో సమన్వయం, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారిని గుర్తించి పదవి ఇవ్వడం జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఘనవిజయం సాధించి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పీసీసీ అబ్జర్వర్ ఎండి.అవేజ్, పీసీసీ కో–ఆర్డినేటర్ నాగులూరి అరుణ్‌కుమర్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.