
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి
హన్మకొండ: వినియోగదారులకు అంతరాయాలు లేని మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని అధికారులు, ఉద్యోగులకు టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ స్థాయి సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు, బ్రేక్ డౌన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రధానంగా వ్యవసాయానికి అంతరాయాలు లేని విద్యుత్ అందించాలని చెప్పారు. రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలన్నారు. సమావేశంలో ఆపరేషన్ –2 సీజీఎం రాజు చౌహాన్, వరంగల్ సర్కిర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతంరెడ్డి, డీఈలు ఎ.ఆనందం, ఎస్.మల్లికార్జున్, తిరుపతి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంజీవరావు, ఏడీఈ, ఏఈలు, ఏఏఓ, జేఏఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు.